తెలంగాణ

సాఫ్ట్‌వేర్ రంగంలో సంక్షోభం -దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగులకు ఉద్వాసన

హైదరాబాద్‌ : అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి అతిపెద్ద కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే అనేకమంది టెక్ ఉద్యోగులు కొలువుల్ని కోల్పోయారు. కోవిడ్ తర్వాత దిగ్గజ కంపెనీలు సైతం కాస్ట్ కటింగ్ చేస్తున్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగుల తీసివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు కొత్త నియామకాలను నిలిపివేశాయి.

ఇదొక స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనా.!
అయితే, ఇది కేవలం వేగంగా వెళుతున్న కారుకు స్పీడ్‌ బ్రేకర్‌ అడ్డొచ్చినట్లుగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. అంచనాలకు మించి ఉద్యోగులను నియమించుకోవడం, అందుకు అనుగుణమైన గ్రోత్‌ 2022లో లేకపోవడానికి కారణాలుగా పేర్కొంటున్నారు. పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యతో పోల్చితే.. తీసేసిన ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువ అని అంటున్నారు. కోర్‌ ఐటీ సెక్టార్‌లో పెద్దగా ఉద్యోగాలు తగ్గక పోవచ్చని అంటున్నారు.

Leave a Reply