తెలంగాణ

మొన్న ఎన్టీఆర్.. నేడు నితిన్.. జేపీ న‌డ్డాతో భేటీ.. ఎందుకో?

హైదరాబాద్ : టాలీవుడ్ యంగ్ హీరోలు బీజేపీ నేతలతో భేటీ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటికి మొన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కాగా.. నేడు తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో శ‌నివారం రాత్రి టాలీవుడ్ యువ హీరో నితిన్ భేటీ అయ్యారు.

బీజేపీ నేత‌ల ఆహ్వానం మేర‌కే శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌కు వెళ్లిన నితిన్‌… న‌డ్దాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ‌కు చెందిన బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు ల‌క్ష్మ‌ణ్, మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావులు కూడా వున్నారు. అయితే ఈ భేటీ ఎందుకు జరిగిందనే అంశం ఇంకా వెలువడలేదు.

Leave a Reply