తెలంగాణ

ఐటీ నోటీసు అంటే హాస్పిటల్‌కు వెళ్తున్నారు..! -ఎమ్మెల్యే రఘునందన్‌

హైదరాబాద్ : ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు. ఈ అంశానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పడం సరికాదన్న రఘునందన్.. సాక్ష్యాల ఆధారంగానే అధికారులు విచారణ జరుపుతారని తెలిపారు. కొడుకును కొట్టారంటూ మల్లారెడ్డి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. మంత్రి కుమారుడు మహేందర్‌ రెడ్డిని అధికారులు కొట్టారనడం సరికాదని మండిపడ్డారు. ఎవరికీ నోటీసులు ఇచ్చినా అస్వస్థత పేరుతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఎద్దేవా చేశారు.

రాజకీయంగా ఎదుర్కోలేకనే -ఎమ్మెల్యే వివేకానంద
రాజకీయంగా ఎదుర్కోలేకనే కేంద్రం ఐటీ, సీబీఐ దాడులు చేయిస్తోందని కుత్బుల్లాపుర్‌ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌ ఆరోపించారు. బీజేపీ శిక్షణా తరగతుల్లో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి కాకుండా ప్రభుత్వాన్ని విమర్శించేందుకే తరగతులు నిర్వహించారని ఆరోపించారు.

Leave a Reply