తెలంగాణ

స్కాలర్షిప్ ఫీజులను వెంటనే మంజూరు చేయాలి

ఆర్మూర్ : ఈరోజు ఆర్మూర్ పట్టణంలో శాస్త్రి నగర్ లో సిపిఎం కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అని సంగం సభ్యులు అన్నారు . ఈ సమావేశంలో సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న మోడల్ కాలేజ్ లో గత 7 సంవత్సరాలుగా పేద విద్యార్థులు స్కాలర్షిప్ రాక నష్టపోతున్నారు అన్నారు. టెక్నికల్ సమస్య వల్ల స్కాలర్షిప్ రావడం లేదని కాలేజీ అధికారులు తెలపడం జరిగింది. వెంటనే పేద పిల్లలకు స్కాలర్షిప్ వచ్చే విధంగా టెక్నికల్ సమస్యను పరిష్కారం చేసి పేద విద్యార్థులకు చేయూత నివ్వాలని సిపిఎం ఆర్మూరు డివిజన్ కమిటీ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కేవలం ఆర్మూరు , జక్రంపల్లి మోడల్ కాలేజీల్లో మాత్రమే స్కాలర్షిప్ సమస్య ఉన్నదని వెంటనే ఇట్టి సమస్యను స్థానిక ఎమ్మెల్యే చొరవ చేసి పేద విద్యార్థులు నష్టపోకుండా స్కాలర్షిప్ పేద విద్యార్థులకు వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టీ భూమన్న ,సాకలి రాజన్న, పల్లపు అంజయ్య, చిన్నయ్య, జవహర్ సింగ్ ,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply