తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వానికి భాష పండితుల అల్టిమేటం

ఖైరతాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి భాష పండితులు అల్టిమేటం విధించారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భాష పండితుల ఉమ్మడి ఐక్య వేదిక నాయకులు కలిశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న బదిలీలు, పదోన్నతుల్లో భాష పండితులకు మొండిచెయి చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. తమ చార్ట్ ప్రకారం 6 నుంచి 8 తరగతులకు మాత్రమే బోధిస్తామన్న స్పష్టం చేశారు. కోర్టు కేసుల పేరుతో ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply