తెలంగాణ

కొనసాగుతున్న హాత్ సే హాత్ జోడో అభియాన్

మంచిర్యాల : దేశంలో, రాష్ట్రంలో సుస్థిర పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా బుధవారం ఆమె నస్పూర్ మున్సిపాలిటీలోని 16వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

Leave a Reply