జాతీయ వార్తలు

కరోనాపై భారతీయ పరిశోధకుల విజయం?

మద్రాస్ : మన శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్, జాదవ్ పూర్ వర్శిటీ, యూఎస్ నార్త్ వెస్టర్న్ పరిశోధకుల బృందం ఓ అధ్యయనం నిర్వహించింది. వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాస కోశ వ్యవస్థని దెబ్బ తీస్తుందని కొన్ని గణిత నమూనాల ద్వారా గుర్తించారు. చికిత్సలో భాగంగా మనం టీకా వేసుకుంటే అవి గొంతులో వైరస్ ప్రభావాన్ని తగ్గించి ఊపిరితిత్తుల్లోకి చేరకుండా నిరోధిస్తాయని అధ్యయనంలో పేర్కొన్నారు. న్యూమోనియా, తీవ్ర వ్యాధులను నియంత్రించడంలోనూ టీకా సహాయపడుతుందని వెల్లడించారు.

Leave a Reply