అస్కార్ స్టేజ్ పై ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి మాట్లాడిన దీపికా పదుకోణె
లాస్ ఏంజెల్స్ : బాలీవుడ్ నటి దీపిక పదుకోణె(Deepika Padukone) అస్కార్ వేదికపైకి చేరుకున్నారు. స్టేజ్ పై ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ… అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ గురించి దీపిక వివరించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో సింగర్స్ కనివిందు చేశారు. ఇండియన్ ఫిలిం ఇండ్రస్ట్రీలో సంచలయం సృష్టించిన RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ని సభలో ఆశీనులైన నటీనటులు చాలా ఎంజాయ్ చేశారు. ఆస్కార్ అవార్డ్స్ వేదికపై నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు పెర్ఫామెన్స్ ఇచ్చారు. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన ఇవ్వడంతో థియేటర్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది.