తెలంగాణ

నేడు బండి సంజయ్ నిరసన దీక్ష

హైదరాబాద్ : TSPSC క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు నిరసన దీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీక్ష చేపట్టనున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలను బండి సంజయ్ ఇదివరకే డిమాండ్ చేయగా.. ఇందులో వైఫల్యమైన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ధర్నా చేపట్టనున్నారు. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలనే డిమాండ్ లతో నిరసనకు పూనుకోనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేయనున్నారు.

Leave a Reply