కత్తిగట్టిన రాయి.. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
న్యూస్ వన్ టీవీ, ఆంధ్రప్రదేశ్ :- సీఎం జగన్‌పై రాయి దాడి. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఓ సెన్సెషన్.. అధికార, విపక్షాల మధ్య ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. పొలిటికల్ టెన్షన్ పెంచుతుంది. ఈ హైప్రొఫైల్ వీఐపీ కేసులో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ సీఎం జగన్‌ను హత్యకు ప్లాన్ చేశారా? లేక పొలిటికల్‌గా అలజడి సృష్టించే ఉద్దేశమా? అసలు కుట్రలో ఉన్నవారి సంఖ్య ఎంత? వేముల సతీష్ కుమార్ అలియాస్ సత్తి.. సీఎంపై రాయి విసిరిన యువకుడు.
ఈ కేసులో ఏ1. అతను ఇప్పటి వరకు అనుకున్నట్టు మైనర్ కాదు. అతడి వయసు 19 సంవత్సరాలు. ఇది కొత్త విషయం. అండ్ ఇప్పటి వరకు అంతా అనుకున్నట్టు ఇది ఆకతాయిల పని కాదు. సీఎం జగన్‌ను మట్టుపెట్టేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ఓ వ్యక్తి సతీష్‌తో డీల్ కుదుర్చుకున్నాడు. దీ రిమాండ్ రిపోర్ట్ చెబుతున్న సారాంశం. ఇక్కడో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏ రోజైతే దాడి చేశాడో.. ఆ రోజే నిందితుడి బర్త్‌డే.. ఆ రోజుతోనే అతని మైనార్టీ తీరిపోయింది. సో మేజర్‌గానే అరెస్ట్ చూపించారు పోలీసులు.
సీఎం జగన్‌పై దాడి అనేది అప్పటికప్పుడు అనుకోకుండా జరిగింది కాదు. ఓ వ్యక్తి అంటే ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. అతను చెబితేనే సత్తి సీఎం జగన్‌పై రాయితో దాడి చేశాడు. ఈ నెల 13న మేమంతా సిద్ధం రోడ్ ర్యాలీలో విజయవాడ సింగ్ నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్దకు రాగానే.. ఓ షార్ప్ రాయితో సీఎంను చంపే ఉద్దేశంతో సెస్సిటివ్ పార్ట్ అయిన తలపై అటాక్ చేశాడు. అంతేకాదు సత్తి ముందుగానే రాయిని తీసుకొచ్చాడు. షార్ప్‌గా ఉన్న సిమెంట్ కాంక్రీట్ స్టోన్‌ను వచ్చేటప్పుడే తీసుకొచ్చాడు. సీఎం స్కూల్ వద్దకు రాగానే జేబులో నుంచి రాయిని తీసి విసిరాడు. కానీ లక్కీగా జగన్ మోహన్ రెడ్డి స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది కాబట్టి 15 రోజుల పాటు నిందితుడిని కస్టడీకి ఇవ్వండి. ఇదీ పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచిన కీలక అంశాలు.
కాల్‌డేట, సీసీ ఫుజేట్‌లోనూ స్పాట్‌లో నిందితుడి కదలికలు గుర్తించాం. తమకు వచ్చిన సమాచారంతో అన్ని ఆధారాలు సేకరించి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఏ2 ప్రోద్బలంతో దాడి జరిగినట్టు గుర్తించామని.. ప్లాన్ ప్రకారమే సమయం చూసి పదునైన రాయితో జగన్‌పై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ కేసులో ఏ2 ఎవరు? నిందితుడికి జగన్‌పై దాడి చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు?
ఇన్ని విషయాలు చెప్పిన నిందితుడు. అతని పేరు చెప్పలేదా? లేక చెప్పినా కావాలనే రిమాండ్ రిపోర్ట్‌లో అతని పేరును మెన్షన్ చేయలేదా? పోలీసుల వర్షన్ ఇలా ఉంటే.. సతీష్ తరపు న్యాయవాదుల వర్షన్ మాత్రం మరోలా ఉంది. ఇది పూర్తిగా ఫాల్స్ కేసు అని వాదిస్తున్నారు వారు. సతీష్‌కు జగన్‌కు ఏంటి సంబంధం? ఏమైనా పాతకక్షలు ఉన్నాయా? కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు అంటున్నారు. వారు? నిందితుల తల్లిదండ్రుల వర్షన్ మాత్రం మొదటి నుంచి మరోలా ఉంది. తమ బిడ్డలు పూర్తి అమాయకులు అనేది వారు చెబుతున్న మాట.
అందరి వాదనలు విన్న తర్వాత మళ్లీ సేమ్.. మరో కేసు గుర్తొస్తుంది. అదే కోడి కత్తి కేసు.. సేమ్ అప్పుడు కూడా ఇలానే హడావుడి నడిచింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు. కానీ కేసును మాత్రం ఐదేళ్లైనా ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు కూడా సేమ్ మళ్లీ అలాంటి సీనే కనిపిస్తోంది. మరి ఈసారైనా నిందితుడి అసలు మోటివ్ ఏంటి? అని ప్రూవ్ చేస్తారా? లేదా? ఎప్పటిలానే ఎన్నికలు ముగియగానే మర్చిపోతారా? అనేది తేలాల్సి ఉంది.