జాతీయ వార్తలు

సోనియాగాంధీ ఎక్కడ?

ఢిల్లీ : జాతీయ కాంగ్రెస్ లో పట్టు సన్నగిల్లిపోతోంది. 24ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాంధీ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నారా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. లేదంటే ఆరోగ్యం మళ్లీ క్షీణించిందా? అనే ఆందోళనలు నేతల్లో కనిపిస్తున్నాయి.

ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పట్టుకోల్పోయి కేవలం రాజస్థాన్, ఉత్తరాఖాండ్ లో మాత్రమే అధికారం దక్కించుకుని కొన ఊపిరితో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.

ఒకవైపు రాహుల్ గాంధీ జోడో యాత్ర నడుస్తోంది. ఇది కొద్దిగా సత్ఫలితాలను ఇస్తున్నట్టు కనిపించాలంటే ఈ రెండు రాష్ట్రాల్లో తమ పట్టు నిలబెట్టుకోక తప్పని పరిస్థితులున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సోనియాగాంధీ గుజరాత్ తొలిదశ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడంపై సొంత పార్టీలో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు రాహుల్ జోడోయాత్రలో కూడా కాసేపు మాత్రమే కనిపించారు.

ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోంచి తప్పుకున్నారని కొందరు అంటుంటే, మరికొందరు మళ్లీ అనారోగ్యం ఏమైనా తిరగబెట్టిందేమోనని అంటుంటే, మరికొందరు శీతాకాలం కావడంతో ఆరోగ్యరీత్యా బయటకు రావడం లేదని ఇలా రకరకాలుగా వ్యాక్యానిస్తున్నారు. ఏది ఏమైనా రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఒంటిచేత్తో ముందుడి నడిపించిన సోనియాగాంధీ ఉనికి లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏటికి ఎదురీదక తప్పదని పలువురు వ్యాక్యానిస్తున్నారు.

Leave a Reply