జాతీయ వార్తలు

కవితకు కష్టమే! నెక్ట్స్ అరెస్ట్ ఆయనేనా? సుకేశ్ లేఖలో ఏముంది ?

న్యూస్ వన్ టీవీ, న్యూఢిల్లీ :- కవిత కథ కంచికి చేరకముందే.. మరింత మంది కథలు ముగియనున్నాయా? కవిత ఇప్పట్లో బయటికి రావడం అసాధ్యమేనా? కోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకోవడంతో ఆమె డౌన్‌ఫాల్ స్టార్టయ్యిందా? అసలు మొత్తం లిక్కర్‌ కేసు కొత్త మలుపు తిరగబోతుందా? త్వరలో హైప్రోఫైల్ వ్యక్తి అరెస్ట్ అంటూ సీబీఐ ఎత్తుకున్న రాగం వెనక కథేంటి? కేజ్రీవాల్‌ చెరసాలకు చేరడం తప్పదా? తీహార్‌ నుంచి వచ్చే లేఖలు.. సుప్రీంకోర్టులో పిటిషన్లు.. రౌస్ అవెన్యూలో వాదనలు.. ఇక్కడ అన్నీ ఇంటర్‌లింక్‌డే.. విషయాలన్నింటిని డీకోడ్ చేద్దాం. అసలు విషయాలు తెలుసుకుందాం..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చెరలో ఉన్న కల్వకుంట్ల కవిత.. ఇప్పట్లో ఆ చెర నుంచి విడుదలయ్యే చాన్స్‌ కనిపించడం లేదు. ఈడీపై న్యాయపోరాటం అనే స్లోగన్‌తో సుప్రీంమెట్లెక్కిన కవిత..ఈరోజు ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది? ఇంతకీ కవిత వేసిన పిటిషన్‌ ఏంటి? ఈరోజు ఎందుకు వెనక్కి తీసుకుంది? ఇదే కదా మీ డౌట్.. 2023లో ఈడీ కవితకు సమన్లు జారీ చేసి విచారించింది. మూడు సార్లు విచారణకు హాజరయ్యాక.. అసలు మహిళలను ఇలా విచారణ పేరుతో వేధించడం ఏంటి.. అసలు మహిళలను విచారించేందుకు కొత్త మార్గదర్శకలు సూచించాలంటూ.. గతేడాది మార్చి 14న పిటిషన్ వేశారు..
దీంతో సుప్రీంకోర్టు పది రోజుల పాటు నోటీసులను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.

కానీ ఆ తర్వాత ఏం చేయలేదు. సుప్రీంకోర్టు పిటిషన్‌పై విచారణ పూర్తి కాలేదు. ఇంతలో ఈడీ తన పని తాను చేసుకుపోయింది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఆమెను అరెస్ట్ చేసింది. ఇక అరెస్ట్ అయ్యాక.. పిటిషన్‌ వేసి ఏం లాభం.. విచారణ జరిగి ఏం లాభం..అనుకున్నారేమో.. ఆ పిటిషన్‌నే ఉపసంహరించుకున్నారు. దీనికి ఈడీ తరపు లాయర్ అస్సలు అబ్జేక్షన్ చెప్పలేదు..
దీంతో కోర్టు పిటిషన్‌ ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేసింది..

ఈ పిటిషన్ ఓకే.. కానీ ఈడీ చెర నుంచి త్వరగా బయటికి వచ్చేందుకు.. అదే సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేశారు.. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో అరెస్ట్ చేయమని చెప్పి.. ఇప్పుడు తనను అరెస్ట్ చేశారు.. సో ఇది అక్రమం.. అన్యాయం.. అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.. దీనికి సపోర్ట్‌గా రాజ్యాంగంలోని కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు..అయితే ఈ విషయంలో కూడా కవితకు షాక్‌ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే అసలు ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకోవాలా? వద్దా? అనే విషయం ఇంకా తేలలేదు. సీజేఐతో కూడిన బెంచ్‌ ఈ విషయాన్ని తేల్చాల్సి ఉంది. ఒకవేళ విచారణకు స్వీకరిస్తే.. మరో బెంచ్‌కు రిఫర్ చేస్తారు.ఇదంతా ఒక్కరోజులో అయ్యే పనైతే కాదు.అయితే సుప్రీంకోర్టు ఈ నెలలో పనిచేసేది మరో మూడు రోజులు మాత్రమే. ఈ నెల 22 నుంచి 31 వరకు కోర్టుకు హోలీ సెలవులు..ఆ లోపు వ్యవహారం తేలిందా ఓకే..లేదంటే ఏప్రిల్‌ ఒకటినే మళ్లీ సుప్రీం తలపులు తెరుచుకునేది.. ఈ లోపు చాలా విషయాలు తేలనున్నాయి..మరిన్ని బ్రేకింగ్‌ న్యూస్‌లు టీవీల్లో మారుమోగనున్నాయి..

ఎందుకింత ఖరాకండిగా సంచలనం జరగబోతుంది? అని చెబుతున్నారు. అనే కదా మీ మదిలో మెదిలో డౌట్ ఉంది. దానికి ఆన్సర్ ఉంది. సఅది మరేంటో కాదు.. కవిత అరెస్ట్.. కవిత అరెస్ట్ పాత న్యూస్.. ఇప్పుడు కాబోయే అరెస్టే మరో సెన్సెషనల్ న్యూస్.. నిజానికి ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఈడీ.. ఇప్పుడు ఈ రేంజ్‌లో దూసుకెళ్లడానికి మెయిన్‌ రీజన్.. అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అయిన కేజ్రీవాల్‌.. ఈ మొత్తం లిక్కర్‌ స్కామ్‌లో కీరోల్ అని అటు సీబీఐ, ఈడీ ఘంటాపథంగా చెబుతున్నమాట.. ఏ తీగ లాగిన కేజ్రీవాల్ డొంకే కదులుతుందన్న రేంజ్‌లో చెబుతోంది సీబీఐ..
అంటే కేజ్రీవాల్ అరెస్ట్ ప్రచారం చాలా రోజులుగా జరుగుతున్నదే.. కానీ తాజాగా కోర్టులో సీబీఐ వినిపించిన వాదనలే.. ఈ కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి.

ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఆప్ నేత మనిష్‌ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా సీబీఐ చేసిన కొన్ని వ్యాఖ్యలు..కేజ్రీవాల్‌ జైలుకు వెళ్లక తప్పదని చెబుతున్నాయి..నాకు బెయిలివ్వండి అని మనిష్‌ సిసోడియా అనగానే.. నో.. ఇవ్వొద్దు.. త్వరలో ఓ హైప్రోఫెల్‌ వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నాం..
ఇప్పుడు ఈయనకు బెయిల్ ఇస్తే.. బయటికి వెళ్లి సాక్షులను ప్రభావితం చేస్తారు.. అని చెప్పేసింది.. దీంతో బెయిల్ పిటిషన్‌ డిస్మిస్.. సిసోడియాకు షాక్.. అయితే బిట్విన్ ద లైన్స్‌ చూస్తే.. ఎవరా హైప్రోఫెల్ వ్యక్తి? అనేది ఇట్టే అర్థమైపోతుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఉన్న ఏకైక హైప్రోఫైల్ వ్యక్తి… అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే.. సో.. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్‌ తప్పదని తెలిసిపోతుంది.

అయితే ఇక్కడొక గమ్మతైన విషయం ఉంది. అదేంటంటే.. మొన్ననే ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే అది ఈడీ కేసులో మాత్రమే.. ఈడీ నుంచి కేజ్రీవాల్ మిస్సైన వెంటనే..
సీన్‌లోకి సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. బాంబు పేల్చింది..దీంతో సీబీఐ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి? ఎప్పుడు ఆయనను అరెస్ట్ చేయబోతుంది? అనేది ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ అనలేమో కానీ.. ఉత్కంఠగా మారింది..

అసలు కవిత అరెస్ట్ అసలు ఉద్ధేశం కేజ్రీవాల్‌ను కార్నర్ చేయడమేనా? అందుకే ఆమెను ఇంత హడావుడిగా అరెస్ట్ చేశారా? అంటే కొంత ఔననే సమాధానం వస్తుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో స్కామ్‌కు స్కెచ్ వేసింది కవిత అయితే.. దాన్ని అమలు చేసింది కేజ్రీవాల్ అన్నది దర్యాప్తు సంస్థల ఆరోపణ. అందుకే.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలంటే ముందు కవితను అరెస్ట్ చేయాలి. ఆమెతో కేజ్రీవాల్ పేరు చెప్పించాలి.. అందుకే ఇంత అకస్మాత్తుగా కవితను అరెస్ట్ చేసింది ఈడీ. ఇక మిగిలింది కేజ్రీవాల్ అరెస్టే..

తప్పుడు కేసులు.. పొలిటికల్ రీవెంజ్.. తనను ఈడీ అరెస్ట్ చేసినప్పటి నుంచి కవిత చెబుతున్న మాటలు.. అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలంటున్నారు కాన్ మ్యాన్‌ సుఖేష్‌ చంద్రశేఖరన్.. ఈ కేసులో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ అతని న్ లెటర్స్.. జైలు నుంచి ఆయన అప్పుడప్పుడు రిలీజ్‌ చేసే లెటర్స్..
రాజకీయాలను ఓ కదుపుకు గురి చేస్తాయి. ఈ సారి కూడా అదే చేశాయి. ప్రస్తుతం మండోలి జైల్లో ఉన్న సుఖేష్ కేజ్రీవాల్, కవితపై సీరియస్ అలిగేషన్స్ చేశారు.. అవినీతి భాండాగారం బద్ధలు కాబోతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు.. బీఆర్‌ఎస్, ఆప్‌పై చాలా అంటే చాలా పెద్ద ఆరోపణలే చేశారు..
అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మంతటిని.. సింగపూర్‌, హాంకాంగ్‌, జర్మనీలో దాచుకున్నారు.. అది కూడా బయటికి వస్తుందన్నారు?

ఇంతకీ నేతల అవినీతి సొమ్మెంత? ఆయా దేశాల్లో నిజంగానే దాచుకున్నారా? ఈడీ వీటి లెక్కల చిట్టాను బయటకు తేబోతుందా? సీబీఐ కేజ్రీవాల్‌ను కార్నర్ చేయడం కన్ఫామైందా? కవిత పిటిషన్‌ను విచారణకు తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? అన్నింటికి కాదు కానీ.. కొన్నింటి సమాధానాలు మాత్రం రాబోయే వారం రోజుల్లో తేలనున్నాయి.. లిక్కర్‌ స్కామ్ కేసును.. సరికొత్త మలుపు తిప్పబోతున్నాయి.

Leave a Reply