జాతీయ వార్తలు

ప్రియుడి సలహాతో భర్తను చంపిన భార్య.. 3 నెలల తర్వాత కనిపెట్టిన కుమార్తె

మహారాష్ట్ర : మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలో కట్టుకున్న భార్యను ఓ భార్య కిరాతకంగా చంపేసింది. తన ప్రియుడి చెప్పిన మాటలు విని ఈ ఘాతుకానికి పాల్పడింది. నిద్రపోతున్న భర్త ముఖంపై దిండి నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత గుండెపోటుతో చనిపోయినట్టుగా బంధువులను నమ్మించి అంత్యక్రియులు కూడా పూర్తి చేసింది. కానీ, మూడు నెలల తర్వాత తల్లి మొబైల్ ఫోన్‌లోని రికార్డింగ్ కాల్స్‌ను పరిశీలించిన కుమార్తె.. తల్లి చేసిన నేరాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇపుడు ఆమె జైలు ఊచలు లెక్కిస్తున్నారు.

ఈ వివరాలను పరిశీలిస్తే, చంద్రపూర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను ఆయన భార్య రంజన ఆగస్టు 6వ తేదీన హత్య చేసింది. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడికి చెప్పింది. అతను ఇచ్చిన సలహా మేరకు తన భర్త గుండెపోటుతో చనిపోయినట్టు కుమార్తెతోపాటు బంధువులను నమ్మించి, అంత్యక్రియలు పూర్తిచేసింది.

అయితే, తండ్రి మరణించిన మూడు నెలల తర్వాత కుమార్తె శ్వేత తన స్నేహితులకు ఫోన్ చేసేందుకు తల్లి మొబైల్‌ను తీసుకుంది. అందులే రికార్డింగ్ అయిన కాల్ లిస్టును పరిశీలించగా, రంజన తన ప్రియుడితో మాట్లాడిన మాటలు విని నిర్ఘాంతపోయింది. శ్వేత ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రంజనను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

Leave a Reply