తెలంగాణ

గుండెపోటుతో జిమ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిన కానిస్టేబుల్‌

హైదరాబాద్ : హైదరాబాద్​లోని ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నర్వహిస్తున్న విశాల్‌.. ఇవాళ ఉదయం బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని సహచరులు వచ్చి చూసేలోపే మరణించాడు. అయితే ఆయనను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించినట్లు సహచరులు తెలిపారు.

అయితే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. జిమ్‌లో హుషారుగా జిమ్‌ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే కన్నుమూశాడు. నగరంలోని ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నర్వహిస్తున్న విశాల్‌.. రోజూలానే శుక్రవారం ఉదయం బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లారు. వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని సహచరులు వచ్చి చూసేలోపే మృతిచెందాడు.

అయితే ఆయనను దవాఖానకు తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కాగా, గురువారం నగరంలో జరిగిన ఓ వివాహ వేడుకలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. పెండ్లి వేడుకకు హాజరైన రబ్బాని అనే వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన బంధువులు దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించిన అనంతరం పలువురు ఇలానే హార్డ్‌ స్ట్రోక్‌తో కన్నుమూస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply