మీకు తెలుసా.. ఈ రెండు సందర్భాల్లో టోల్ గేట్ కట్టనవసరం లేదు..!
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ ధరలూ పెరిగాయి. నూనెల ధరలు సలసల మరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో భారం పడింది. వాహనదారులకు షాక్ తగిలింది. టోల్ గేట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి హైవే రోడ్లపై ప్రయాణం మరింత ఖరీదుగా మారనుంది.* కార్లు, జీపులు వంటి వాహనాలపై రూ.5-10 పెంపు.
బస్సులు, లారీలకు రూ.15-25 పెంపు.
భారీ వాహనాలకు రూ.40-50 వరకు టోల్ ఫీజు పెంచనున్నారు.
సింగిల్, డబుల్ ట్రిప్‌లతోపాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది.
ఐతే అయితే ఈ రోడ్లపై టోల్ ట్యాక్స్ కట్టడానికి మనకు కూడా మినహాయింపు ఉంటుంది. కానీ అదెప్పుడు పడితే అప్పుడు కాదు. ఒకట్రెండు సంధర్బాలలో మాత్రమే. ఆ రెండు సంధర్బాలు ఏంటో తెలుసుకుని, మీకు ఇకపై అలాంటి పరిస్థితి ఎదురైతే టోల్ కట్టకుండా ఎంచక్కా వెళ్లిపోండి. ఎవరన్నా ఏమన్నా అడిగితే రూల్స్ చెప్పండి.
టోల్ గేట్ నుంచి 200 మీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అయితే మనం టోల్ కట్టకుండానే గేట్ దాటి వెళ్లవచ్చు. టోల్ గేట్ కు కొద్ది దూరంలో ఒక పసుపు రంగు లైన్ ఉంటుంది. ఆ లైన్‌కు అవతల ఎవరైనా 5 లేదా అంతకన్నా ఎక్కువ నిమిషాల పాటు వేచి ఉన్నట్టయితే వారు కూడా టోల్ కట్టాల్సిన పనిలేదు. నేరుగా గేట్ నుంచి వెళ్లిపోవచ్చు. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు గనక ఎదురైతే టోల్ చెల్లించకండి. ఒక వేళ టోల్ సిబ్బంది ఇబ్బంది పెట్టినా, వాదించినా.. ఈ 2 రూల్స్ ను కచ్చితంగా చెప్పండి.