సిని వార్తలు

విడాకులకు సిద్ధమైన మెగా డాటర్..? షాక్ లో ఫాన్స్

హైదరాబాద్ : ఈ మధ్య కాలంలో అందరికి పెళ్ళి అంటే ఓ ఫోటో గ్రఫీ ఈవెంట్ అయిపోయింది. అయితే మరీ ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయాలల్లో పెళ్లి అనేది ఓ పెద్ద జోక్ అయిపోయింది. ఇక అప్పుడే లవ్ అంటారు..అప్పుడే పిల్లలు అంటారు..అప్పుడే విడాకులు అంటారు.ఇకపోతే ఎంత త్వరగా ప్రేమ పుడుతుందో అంతకంటే త్వరగానే విడాకులకు అప్లై చేస్తున్నారు.అయితే ఈ లిస్ట్ లోకి చాలా ప్రముఖులే వస్తున్నారు.

కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత-నాగచైతన్య , బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, కోలీవుడ్ హీరో ధనుష్..ఇలా స్టార్ జంటలు అధికారికంగా విడాకులు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా నాగబాబు కూతురు నిహారిక తన భర్త చైతన్య నుంచీ విడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలలో నిహారిక హీరోయిన్గా కూడా నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

నిహారిక ,చైతన్యను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అలా వివాహమైన తర్వాత నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది
నిహారిక వెబ్ సిరీస్ లకు, యూట్యూబ్ లో చిన్న చిత్రాలలో నిర్మాతగా వ్యవహరించింది.. నిహారిక ఒకసారి పబ్బులో దొరికిన సంగతి తెలిసిందే..అప్పుడే నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి.కానీ ఈ వార్తలు నిజం కాదని తేలిపోయింది.

ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఈ విషయం నిజమే అంటూ తెలుస్తోంది.. ఈ వార్తకు బలం చేకూరడానికి ముఖ్య కారణం నిహారిక ఇంస్టాగ్రామ్ లో తన భర్త చైతన్యాలు అన్ ఫాలో కావడం అలాగే చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో అవ్వడం.. అలాగే వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను కూడా డిలీట్ చేసినట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందేమో చూడాలి మరి.

Leave a Reply