సిని వార్తలు

సమ్మర్ సీజన్లో మరో బొనాంజా.! ఏప్రిల్ 28న పొన్నియన్-2 రిలీజ్.!

హైదరాబాద్ : అధికారికంగా ప్రకటించిన లైకా ప్రొడక్షన్

దక్షిణాదిన దిగ్గజ దర్శకునిగా మణిరత్నం సుప్రసిద్దుడు. నాణ్యతతో సినిమాలు తీయటంలో సిద్ధహస్తుడు. ఆయన చేతులమీదుగా విడుదలైన సినిమాగా పొన్నియన్ సెల్వన్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది. తెలుగు, త‌మిళం, హిందీ, కన్నడ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదలైన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ ఫస్ట్‌ పార్టులో విక్రమ్‌, నాజ‌ర్‌, శ‌ర‌త్‌కుమార్‌, జ‌య‌రామ్‌, విక్రమ్‌ ప్రభు, కార్తీ, జ‌యం ర‌వి, పార్థీబన్‌, ప్రకాశ్ రాజ్‌, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్‌, త్రిష కీల‌క పాత్రలు పోషించారు. మరి రెండో పార్టులో కూడా వీరంతా ఉంటారా.. లేదంటే.. కొత్త యాక్టర్లెవరైనా యాడ్‌ అవుతారా..? అనేది తెలియాల్సి ఉంది. మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సీక్వెల్‌ పార్టును కూడా తెర‌కెక్కిస్తున్నాయి.

ముందునుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమాకు రెండో పార్ట్ రెడీ అవుతోంది. చిత్రానికి సీక్వెల్‌.. 2023 ఏప్రిల్‌ 28న పొన్నియన్‌ సెల్వన్ -2 ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్టు ప్రకటించింది లీడింగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ లైకా ప్రొడక్షన్. ఈ మేర‌కు స్ట‌న్నింగ్ వీడియోని లాంచ్‌ చేసింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో కొనసాగనున్న సీక్వెల్‌ పార్టు అప్‌డేట్‌ను స్టార్ యాక్టర్స్‌.. విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌ పాత్రల విజువల్స్‌ తో అందించారు. పొన్నియన్‌ సెల్వన్‌-2 పస్ట్ పార్టును మించి కలర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టు తాజా వీడియోతో అర్థమవుతుంది.

లైకా ప్రొడక్షన్ విడుదల చేసిన టీజర్ ను చాలా క్రిస్ప్ గా రూపొందించారు. మణిరత్నం బ్రాండ్ వాల్యూని మరింత పెంచేదిగా ఈ రెండో పార్ట్ తయారు అవుతున్నట్లు అర్థం అవుతోంది.

Leave a Reply