సిని వార్తలు

గ్రాండ్ గా ‘వీరసింహారెడ్డి’ 100రోజుల వేడుక

హైదరాబాద్ : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం 100రోజుల వేడుకను జరుపుకోనుంది. మలినేని గోపిచంద్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ నిలిచింది. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. మరో రెండు రోజుల్లో ఎనిమిది కేంద్రాల్లో విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 23న 100డేస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే ఈవెంట్ ఎక్కడ నిర్వహించనున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా బాలయ్య గత చిత్రం ‘అఖండ’ కూడా 100 రోజుల వేడుకను జరుపుకుంది.

Leave a Reply