ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన చేస్తా- జగన్

శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ మరోసారి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన చేస్తానని స్పష్టం చేశారు. తాను కూడా ఇక్కడే కాపురం పెడతానని చెప్పారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అని తెలిపారు. వికేంద్రీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో తోడేళ్లన్ని ఏకమై తనపైకి వస్తున్నాయని.. అయినా తనకు భయం లేదని జగన్ వెల్లడించారు.

మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ప్రకటించారు.

Leave a Reply