మరో మెగా వారసుడొస్తున్నాడు? అకీరా నందన్ గ్రాండ్ ఎంట్రీ..?
న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: పవర్ స్టార్.. ఆ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువతకు పిచ్చెక్కిపోతుంటుంది. పవన్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఇక పండగే. ఒక్కసారి డైలాగ్ వదిలాడంటే.. అభిమానులకు పూనకాలే. ఇప్పడు ఆయన వారసుడిగా అకీరా నంద్ వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం అకీరా.. వర్కౌట్స్ కూడా ప్రారంభించినట్లు కనిపిస్తోంది.
చూపుల్లోనూ.. మ్యానరిజంలోనూ తండ్రి పవన్ కళ్యాణ్ ను తలపించే అకీరా నందన్.. సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడా సమయం వచ్చినట్లుగా కనిపిస్తోంది. వెండితెరపై తండ్రిలాగే సత్తా చాటేందుకు అకీరా.. సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇందుకోసం జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను.. తల్లి రేణూ దేశాయ్ తన ఇంట్రాలో పోస్టు చేసింది.
రేణూ దేశాయ్ తాజా వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆరున్నర అడుగుల అకీరా.. తెలుగు వెండితెరను ఏలబోతున్న బుల్లెట్ అంటూ పవన్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తండ్రికి మించిన నటుడిగా ఎదగాలంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.