ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు ముందు నుంచి మైండ్ గేమ్ ఆడటం అలవాటు: మంత్రి అమర్నాథ్

విశాఖపట్నం : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ముందు నుంచి మైండ్ గేమ్ ఆడటం అలవాటు అంటూ వ్యంగస్తాలు ప్రయోగించారు. వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ సందర్భంలోనూ తమతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చంద్రబాబు ప్రచారం చేసిన విషయం తెలిసిందేనని అన్నారు. తెలంగాణలో బలం లేకపోయినా చంద్రబాబు.. తమ అభ్యర్థిని బరిలో పెట్టి, సూట్ కేసులు పంపిన విషయం చూశామని అన్నారు. ఇప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేస్తుండవచ్చు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎదేమైనా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలు గెలిచి తీరుతామని మంత్రి అమర్నాథ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply