తెలంగాణ

జూలై 12న జాబ్ మేళా నిర్వహణ

న్యూస్ వన్ టీవీ, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు జూలై 12న ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లిమిటెడ్ హైదరాబాద్ కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 8985336947, 9502642441 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

Leave a Reply