తెలంగాణ

చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే

న్యూస్ వన్ టీవీ, ఖమ్మం: గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. గురువారం ఖమ్మం జిల్లా కల్లూరు గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సర్పంచులు మంజూరైన పనులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.

Leave a Reply