కవిత ఫోన్ నెంబర్లు ఇవే.. మరో లేఖ విడుదల చేసిన సుకేశ్
తెలంగాణ : లిక్కర్ స్కాం నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar) మరో ఐదు పేజీల సంచలన లేఖను విడుదల చేశాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ నెంబర్లు ఇవే అంటూ స్క్రీన్ షాట్స్ బహిర్గతం చేశాడు. 6209999999, 8985699999 నెంబర్లతోనే కవిత తనతో చాట్ చేసిందని లేఖలో పేర్కొన్నాడు. కవితక్క తాను ఎవరో తెలియదని.. తనతో అసలు చాట్ చేయలేదని చెబుతున్నారని.. కానీ చట్టం చేతిలో నుంచి కవితక్క తప్పించుకోలేరని తెలిపాడు. త్వరలోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal)తో చేసిన వాట్సాప్ చాట్ ను కూడా విడుదల చేస్తానని తెలిపాడు. ఈ సందర్భంగా తీహార్ జైలు క్లబ్ కు స్వాగతం అంటూ కేజ్రీవాల్, కవితకు ఆహ్వానం పలికాడు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీచేస్తానని సుకేశ్ వెల్లడించాడు.