క్రీడా వార్తలు

నేడు ఐపీఎల్ అభిమానులకు డబుల్ ధమాకా

Double Dhamaka in IPL| గత వారం రోజుల నుంచి ఐపీఎల్ మ్యాచులు రసవత్తరంగా జరుగతూ క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని ఇస్తున్నాయి. ఇదే ఊపులో నేడు డబుల్ ధమాకా మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30గంటలకు ముంబై ఇండియన్స్-కోల్ కత్తా నైట్ రైడర్స్(MI vs KKR) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కేకేఆర్ రెండు విజయాలతో నాల్గవ స్థానంలో ఉండగా.. ముంబై ఓ విజయంతో చివరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇరు జట్లలో బలమైన హిట్టర్స్, బౌలర్లు ఉండడంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.

ఇక సాయంత్రం 7.30 గంటలకు ఈ సీజన్ లో సమఉజ్జీలుగా ఉన్న గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్(GT vs RR) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడి మూడు విజయాలు నమోదుచేశాయి. రాయల్స్ జట్టులో బట్లర్, జైశ్వాల్, శాంసన్, హెట్మెయిర్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. అటు గుజరాత్ జట్టులోనూ పాండ్యా, సుదర్శన్, మిల్లర్, గిల్ తమ బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు. దీంతో ఈ మ్యాచులో అభిమానులకు సండే మజా ఇవ్వనుంది.

Leave a Reply