తెలంగాణ

టాలీవుడ్ లో ఆ స్టార్ హీరో, హీరోయిన్స్ ఇద్దరూ మరణిస్తారు..? వేణు స్వామి

హైదరాబాద్ : ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి.. గురించి అందరికి తెలిసిందే. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖల జీవితాలలో ఎప్పుడు ఏం జరగబోయేది తెలుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. సమంత – నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు.ఇక రష్మిక తో కూడా తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పింది నేనేనని , తనతో వాళ్ళ ఇంట్లో ప్రత్యేక పూజలు కూడా చేశాను అంటూ తెలిపారు.

ఇక మెగాస్టార్ కూతురుది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదే అంటూ ఆమె కూడా మూడో పెళ్లి చేసుకుంటుంది అంటూ రకరకాలుగా మాట్లాడాడు.అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు తాజాగా ఇద్దరు టాలీవుడ్ సెలబ్రిటీలు చనిపోతారంటూ హాట్ బాంబు పేల్చాడు.టాలీవుడ్‌ లో ‘త్వరలో ఓ యంగ్‌ హీరో, హీరోయిన్‌ చనిపోతారని వారి వయసు 45 ఏళ్లలోపే ఉంటుంది. అదీకాక మేష రాశికి చెందిన హీరోయిన్, వృశ్చిక లేదా మిథున రాశికి చెందిన హీరో చనిపోతాడు.

ఆ మరణం ఆత్మహత్య కావొచ్చు లేదా సహజ మరణం కావొచ్చు’ అని వెల్లడించారు. అయితే అతడు చెప్పినట్లుగానే 40 సంవత్సరాలు ఉన్న తారకరత్న మరణించడంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కసారిగా వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే హీరోయిన్‌ కూడా మరణిస్తుంది అని చెప్పడంతో.. ఇప్పుడు ఆ హీరోయిన్‌ ఎవరా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. గతంలో చాలా మంది సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి చెప్పినవి చెప్పినట్లే జరిగాయి. దాంతో సెలబ్రిటీలు ఇతడి దగ్గరికి క్యూ కట్టారు.

Leave a Reply