ఆంధ్రప్రదేశ్

ప్రజా ప్రతినిదులు హక్కుల పట్ల జవాబుదారిగా ఉండాలి

పాడేరు : ప్రజా ప్రతినిదులు హక్కుల పట్ల జవాబుదారిగా ఉండాలని, లేదంటే ద్రోహులుగా మిగిలిపోతారని ఆదివాసి జెఎసి అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్ రామారావు దొర స్పష్టం చేశారు.

ఆదివాసి హక్కులు పెద్ద ఎత్తున ఉంల్లంగనలు జరుగుతుంటే కనీసం నోరు మెదపని ప్రజా ప్రతినిదులు జాతికి ద్రోహం చేసిన ద్రోహులుగా మిగిలి పోతారని, ఇప్పటికైనా జవాబుదారిగా ఉండాలని రామారావు దొర హితవు పలికారు. అరకులోయ మండలం లోతేరు పంచాయతీలోని పలుగ్రామాలలో సోమవారం పర్యటించిన ఆయన అరకులోయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఏభై లక్షల మంది బోయ వాల్మీకి, నకిలీ బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకైమై తీవ్రమైన కుట్రలు పన్నుతున్న ఆదివాసి ప్రజా ప్రతినిదులు నోరు మెదపకుండా మిన్నకుంటున్నారని, ఈ మౌనం ఆదివాసుల మనుగడకే ప్రమాదకరమని రామారావు దొర అన్నారు. శామ్యూల్ ఆనంద్ కమిషన్ రిపోర్ట్ సాకుగా చూపి వచ్చే అసెంబ్లీ సమావేలాల్లో బోయవాల్మీకి కులాలను ఎట్టి జాబితాలో చేర్చడానికి జీవో నెంబర్ 3 రద్దుతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి “షెడ్యూల్డ్ ప్రాంతాల ఉద్యోగ నియామకాల చట్టం” రూపొందించుకోవడానికి ఆదివాసులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్ట సభల్లో సీజర్చించాలని దొర డిమాండ్ చేశారు. అంతేకాకుండా జాతీయ రహదారి నిర్మాణం, చింతపల్లి ఎర్రవరంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసేతరుల వలసలు పెరగడం వలన ఆదివాసులు పెద్ద ఎత్తున భూములు కోల్పోతున్నారని, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం కఠినంగా అమలు చేయాలనీ ప్రభుత్వానికి డిమాండ్ చేసారు. ఆదివాసులు ఇచ్చిన ఫిర్యాదులకు ప్రభుత్వం స్పందించా కుండా నిర్లక్ష్యం చేయడం వలెనే ఏజెన్సీలో అక్రమ కట్టడాలకు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో అరకులోయ మండల జేఏసీ నాయకులు లొక్కొయి మహాదేవ్, కిల్లో ఆనంద్, జి. ఎస్. యు ప్రతిజినిది కొంతేరి కామరాజు, శెట్టి అశోక్ లు పాల్గొన్నారు.

Leave a Reply