ఆంధ్రప్రదేశ్

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు

పెందుర్తి : పరవాడ – సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు,zxబల్లాటలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పరవాడ సిఐ పెద్దిరెడ్ల ఈశ్వరారావు హెచ్చరించారు. దీనికి సంబంధించి గురువారం అయిన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కోడి పందాలు నిర్వహించడం, స్థలాలు ఇవ్వడం, పేకాట, బల్లాట నేరమన్నారు. అలాగే అసాంఘిక నృత్యాలు, రికార్డింగ్ డాన్స్ ల ఏర్పాటు కూడా నేరమన్నారు. జూద క్రీడలతో కాకుండా సంప్రదాయ ఆట పాటలతో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపు కోవాలన్నారు. ఒక వేళ మండల పరిధిలోని ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తమ ఫోన్ నెంబర్ 9440796038 కు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

Leave a Reply