జాతీయ వార్తలు

నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో.. ధర రూ.4,999.. ఫీచర్స్ ఇవే

ఢిల్లీ : నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ నెల 19 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.4,999గా ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ వెనుక వైపు ఒక జత ఇన్‌బిల్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కూడా ఉన్నాయి. మామూలుగా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌కు ఒక ఛార్జింగ్ కేస్ ఉంటుంది. కానీ ఈ ఇయర్‌బడ్స్‌కు ఛార్జింగ్ కేస్ ఉండదు.

ఎందుకంటే ఫోనే ఛార్జింగ్ కేస్‌లా పని చేస్తుంది. అలాగని ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ నోకియా ఫోన్‌తో మాత్రమే పని చేస్తాయనుకుంటే పొరపాటే. ఇతర ఏ ఫోన్‌తోనైనా కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇదే నోకియా ఫోన్ ద్వారా ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‪లో లౌడ్ స్పీకర్, ఇన్‌బిల్ట్ ఎంపీ3 ప్లేయర్, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ కూడా ఉన్నాయి. అలాగే 4జీ నెట్‌వర్క్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.
ఫీచర్స్

1,450 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ,

31 రోజుల స్టాండ్ బై టైమ్, 2.4 అంగుళాల డిస్‌ప్లే,

న్యూమరిక్ అండ్ ఫంక్షనల్ కీస్, 4 ఎంబీ ర్యామ్,

128 ఎంబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయి.

Leave a Reply