జాతీయ వార్తలు

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టార్‌రెంట్‌లో అగ్నిప్రమాదం

పూణే : భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు సొంతమైన రెస్టారెంట్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని లుల్లూ నగర్ చౌక్‌లో ఉన్న మార్వెల్ విస్టా భవనంపై అతస్తులో ఉదయం 8.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు.

మొత్తం ఏడు అంతస్తుల్లోని పై ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగి దట్టమైన పొగ అలముకుంది. దీన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరావడంలేదు. ఈ ప్రమాదం వల్ల ఈ భవనంలో కింది అంతస్తులో ఉన్న జహీర్ ఖాన్ రెస్టారెంట్‌కు ఏదైనా నష్టం వాటిల్లిందో లేదో తెలియాల్సివుంది.

Leave a Reply