ఆంధ్రప్రదేశ్

పవన్ మూడు పెళ్ళిళ్లపై ఆర్జీవీ సినిమా? సీఎం జగన్ ఆదేశం మేరకేనా?

అమరావతి : జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ పేరెత్తితో ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు జడుసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌‍ను వైకాపా నేతలు పదేపదే రెచ్చగొట్టి బూతులు తిట్టించుకున్నారు. అప్పటి నుంచి వైకాపా నేతలు పవన్ పేరెత్తేందుకు భయపడిపోతున్నారు.

అదేసమయంలో వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను పూర్తిగా డ్యామేజ్ చేయాలన్న పట్టుదలతో వైకాపా నేతలు ఉన్నారు. ఇందులోభాగంగానే, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళ అంశాన్ని వైకాపా నేతలు తెరపైకి తెచ్చారు. పదేపదే ఇదే ఈ అంశం గురించే మాట్లాడుతున్నారు. చివరకు సీఎం జగన్ పాల్గొనే బహిరంగ సభల్లోనూ పవన్ కళ్యాణ్ మూడు వివాహాల సంగతిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం సీఎం జగన్‌తో టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లంచ్ మీటింగ్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆ రెండు పార్టీలతో పాటు పవన్ కళ్యాణ్ మూడు వివాహాల అంశాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ సినిమా తీస్తానని ఆర్జీవీ సీఎం జగన్ వద్ద చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజం ఎంతవరకు వుందో చూడాలి.

Leave a Reply