ఆర్టీసీ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ..
విజయవాడ : ఆర్టీసీ డ్రైవర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళ తన బంధువులతో కలిసి దాడి చేసింది. ఈ ఘటన నర్సరావుపేటలో చోటుచేసుకుంది. విజయవాడ-వినుకొండ మధ్య నడుస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల వినుకొండ డిపోకు చెందిన శ్రీనివాస్ అనే ఆర్టీసీ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.
దీంతో కోపోద్రిక్తులైన మహిళ డ్రైవర్‌పై దాడి చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. వీడియోలో, మహిళ మరియు ఆమె బంధువులు బస్సు డ్రైవర్‌పై దాడి చేయడం కనిపించింది.
బస్సులోని ప్రయాణికులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ తతంగం మొత్తం రికార్డు అయి ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.