అంతర్జాతీయ వార్తలు

మూన్ దుబాయ్.. సరికొత్త ప్రపంచం.. 10 ఎకరాల విస్తీర్ణంలో రిసార్ట్

దుబాయ్ : భవిష్యత్తులో దుబాయ్‌ని అత్యంత ఆకర్షణీయ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా దుబాయ్ మీనా ప్రాంతంలో మూన్ దుబాయ్ పేరిట సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.

ఇది అచ్చం చంద్రుడి ఉపరితలంపై ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. పర్యాటకులకే కాదు, అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా ఇక్కడ తమ వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.

ఈ మూన్ ప్రాజెక్టు వల్ల వార్షిక పర్యాటకుల సంఖ్య రెట్టింపవుతుందని మాథ్యూస్ అండ్ హెండర్సన్ మూన్ వరల్డ్ రిసార్ట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ మూన్ రిసార్ట్‌ను 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.

స్పేస్ టూరిజంపై ఆసక్తి ఉన్నవారికి, ఖర్చు భరించగలిగిన వారికి ఇక్కడి లూనార్ కాలనీ అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. చంద్రుడిపై ఎలా ఉంటుందో, అలాంటి వాతావరణాన్నే ఇక్కడ సృష్టించనున్నారు.

దాంతోపాటే ఇక్కడ 300 ప్రైవేటు నివాస గృహాలు కూడా ఉంటాయట. కొద్దిపాటి స్థలంలోనే అధిక సంఖ్యలో గృహాల నిర్మాణం కోసం స్కై విల్లాస్ పేరిట డిస్క్ ఆకారంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు.

Leave a Reply