ఆంధ్రప్రదేశ్

టీడీపీ, జనసేన కూటమిలో కుంపట్లు.. టికెట్ల కేటాయింపుపై రచ్చ రచ్చ..!

న్యూస్ వన్ టీవీ, ఆంధ్రప్రదేశ్ :- టీడీపీ, జనసేన కూటమిలో టికెట్ల కేటాయింపుపై రచ్చ రచ్చ జరుగుతోంది. పలుచోట్ల అభ్యర్థుల మార్పుపై అసమ్మతి సెగ కనిపిస్తోంది. ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరిని మార్చే ఛాన్స్ కనిపిస్తోందో తెలుసుకోవటానికి ఆర్టికల్ లోకి వెల్లండి.

టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమిలో టికెట్ల కేటాయింపుపై రచ్చ రచ్చ జరుగుతోంది. పలుచోట్ల అభ్యర్థుల మార్పుపై అసమ్మతి సెగ కనిపిస్తోంది. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి ప్లేస్‌లో తిక్కారెడ్డిని నిలిపే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఉండి నియోజకవర్గంలోనూ అభ్యర్థి మార్పు? ఉందని సమాచారం. ప్రస్తుతం ఉండి TDP అభ్యర్థిగా రామరాజు ఉన్నారు. అయితే ఆయన స్థానంలో ఉండి నుంచి రఘురామ కృష్ణంరాజుని బరిలో నిలిపే ఛాన్స్ కనిపిస్తోంది.

అంతేకాకుండా, కందుకూరు TDP అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరావుని మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మాడుగుల టీడీపీ క్యాండిడేట్‌ పైల ప్రసాద్‌ను మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రసాద్‌కు తప్ప ఎవరికి ఇచ్చిన అభ్యంతరం లేదంటూ ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో వేరే వ్యక్తిని నియమించే అవకాశం కనిపిస్తోంది.

అనంతపురం(Anantapur) అర్బన్‌లో దగ్గుపాటి ప్రసాద్‌ను మార్చాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటున్నారు ప్రభాకర్ చౌదరి(Prabhakar Chowdary). మరోవైపు పోలవరం అభ్యర్థిగా జనసేన నేత చిర్రి బాలరాజుకు కేటాయించారు. అయితే, పోలవరం సీట్‌ టీడీపీకి ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బొరగం శ్రీనివాస్ లేదా మొడియం సూర్యచంద్రకు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే, రైల్వే కోడూరు(Railway Koduru) జనసేన అభ్యర్థి భాస్కర్ రావు ను మార్చిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో అరవ శ్రీధర్‌ను ప్రకటించింది.

Leave a Reply