వైసీపీలోకి పోతిన మహేష్..!
న్యూస్ వన్ టీవీ, విజయవాడ :- పోతిన మహేష్ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో తన చేత్తో మరో పార్టీ జెండా మోయనని చెప్పిన మహేష్ తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందించారు. జనసేన కోసం కష్టపడ్డ మహేష్ ఆ పార్టీలోనే చనిపోయాడన్నారు. ఇప్పుడు తనది పునర్జన్మని.. ఇష్టం వచ్చిన పార్టీ జెండా మోస్తానని తేల్చిచెప్పారు.
జనసేన కీలక నేత పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పార్టీకి గూడ్ బై చెప్పారు. తాజాగా, పోతిన మహేష్ వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గతంలో తన చేత్తో మరో పార్టీ జెండా మోయనని చెప్పిన మహేష్ తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పందించారు.
జనసేన పార్టీ కోసం కష్టపడ్డ మహేష్ ఆ పార్టీలోనే చనిపోయాడన్నారు. ఇప్పుడు తనది పునర్జన్మ అని తన ఇష్టం వచ్చిన పార్టీ జెండా మోస్తానని తేల్చిచెప్పారు. తనను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నారు.