ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గ ఇంఛార్జులను మారుస్తోన్న సీఎం.. మంత్రుల్లో టెన్షన్

న్యూస్ వన్ టీవీ, ఆంధ్రప్రదేశ్‌ :- సీఎం జగన్ నిర్ణయాలు సొంతపార్టీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మంత్రులకు టెన్షన్ పెడుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జ్‌ల మార్పులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే.. ముగ్గురు మంత్రులను సొంత నియోజకవర్గాల నుంచి మార్చేశారు. మంత్రి అయ్యాక విడదల రజని సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో కేడర్‌కు దూరమయ్యారు. దీంతో.. అక్కడ ఆమె గెలుపు కష్టమనే అనుమానంతో గుంటూరు వెస్ట్‌‌కు పంపించారు.

అటు.. ఆదిమూలపు సురేష్‌ను.. టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కొండపికి పంపారు. అక్కడ గెలుపుపై ఆదిమూలపు సురేష్‌కు ఏమాత్రం నమ్మకం లేదని వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే.. అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రభావం కూడా ఉంటుందని.. ఆయన ఓడిస్తారనే భయం మంత్రిలో లేకపోలేదు. దీంతో సీఎం జగన్‌ను కలిసి తన సమస్య చెప్పుకున్నారు.

సంతనూతలపాడు నియోజకవర్గానికి కొత్తగా వస్తున్న మంత్రి మేరుగ నాగార్జునకు కేడర్ సహకరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఏంచేయాలో ముగ్గురు మంత్రులు రజనీ, సురేష్, మేరుగ నాగార్జునకు పాలు పోవడం లేదు. అయితే.. ఈ ముగ్గురితో పోయేది కాదని.. చాలా మంది మంత్రులకు స్థానచలనం తప్పదని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రులుగా ఉంటూ.. సొంత నియోజకవర్గాల్లో క్యాడర్ కి, ప్రజలకు దూరమైన వాళ్లందరని మరో నియోజక వర్గానికి పంపిస్తారని అనుకుంటున్నారు. దీంతో.. మంత్రులంతా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply