ఆంధ్రప్రదేశ్

నేడు కొత్తవలసలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

శృంగవరపుకోట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కొత్తవలస మండల కేంద్రం స్థానిక నాలుగో సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కొత్తవలస ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే కొత్తవలస 4వ సచివాలయం పరిధిలో శుక్రవారం నిర్వహించవలసిన ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల కారణంగా వాయిదా పడడం విధితమే.

Leave a Reply