ఏపీ మంత్రులపై మరోసారి హరీశ్ రావు ఆగ్రహం
తెలంగాణ : మంత్రి హరీశ్ రావు ఏపీ మంత్రులపై మరోసారి మండిపడ్డారు. తాను ఏపీ ప్రజలను ఏం అన్నానని.. మంత్రులు తనపై ఎగిరెగిరి పడుతున్నారని ప్రశ్నించారు. మీకు చేతనైతే ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడండి.. విశాఖ ఉక్కు కోసం పోరాటం చేయండి అని సూచించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్లు ఇవ్వండని సవాల్ చేశారు. అంతేకాని తనపై నోరు పారేసుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి పక్క రాష్ట్రాలతో పోల్చానని హరీశ్ పేర్కొన్నారు. కాగా హరీశ్ రావుపై ఏపీ మంత్రులు చేసిన కామెంట్లను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.