రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత
అహ్మదాబాద్ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో 17,000 పరుగులు చేసిన ఆరో బ్యాటర్ గా నిలిచాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు. మరో వైపు ఇండియా తరఫున సచిన్ టెండూల్కర్ 34,357, విరాట్ కోహ్లీ 25,047, ద్రావిడ్ 24,064, గంగూలీ 18,433, ఎంఎస్ ధోని 17,092 టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు.