వేంసూర్ లో పర్యటించిన జిల్లా బిఆర్ఎస్ నాయకులు
సత్తుపల్లి : ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో శనివారం నాడు జిల్లా బీఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ ముమ్మరంగా పర్యటించడం జరిగింది. ముందుగా మండల బిఆర్ఎస్ నాయకులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల పరిధిలోని పలు గ్రామాలలో గల సమస్యలను, రాజకీయ పరిస్థితులను గురించి సంబంధిత గ్రామ శాఖ టిఆర్ఎస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.