జాతీయ వార్తలు

అత్యవసరంగా ల్యాండ్ అయినా అపాచీ హెలికాఫ్టర్

న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపరల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే పైలట్ ముందుగానే గమనించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. AH-64 అపాచీ హెలికాప్టర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన హెలికాప్టర్. ఇది మల్టీరోల్ ఆపరేషన్లలో ఉపయోగించబడుతుంది. భారత వైమానిక దళానికి 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. 2020లో భారత సైన్యం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు హెలికాప్టర్లకు ఒప్పందం కుదిరింది.

Leave a Reply