ఆంధ్రప్రదేశ్

50 వేల రూపాయల ఆర్థిక సహాయం

శృంగవరపుకోట : శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో గల స్థానిక డ్రైవర్స్ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి గాను కొత్తవలస మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సరయ్య శెట్టి 50 వేల రూపాయల నగదును సోమవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ముందుగా ఆయన ఆలయ అర్చకుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తన వంతుగా స్వామివారి ఆలయ అభివృద్ధికి భవిష్యత్తులో మరింత సహకారాన్ని అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply