ఆంధ్రప్రదేశ్

దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

పాయకరావుపేట : కొటవురట్ల మండలం పాములవాక గ్రామంలో గత నెలలో ఇంట్లో దొంగతనం చేసిన పాత నేరస్తుడు కనుక రాజబాబును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కెల్లాడ శ్రీరామమూర్తి ఇంట్లో ప్రవేశించి మూడు తులాల బంగారంతో పాటు రెండు కిలోల వెండి వస్తువులను దొంగలించినట్లు ఎస్సై నారాయణరావు తెలిపారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన రాజబాబును అరెస్టు చేసి వాడి దగ్గర నుంచి దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సే నారాయణ రావు తెలిపారు.

Leave a Reply