ఆంధ్రప్రదేశ్

ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండో అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్ షిప్- 2023

ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం మండలం లోని గిరిసోల గ్రామం కు చెందిన బోధిధర్మ సన్లయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25, 26 తేదీల్లో రెండో అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్ షిప్- 2023 నిర్వహించనున్నారు. భారత కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని అగ్నికుల క్షత్రియ మహా మండల్ అధ్యక్షుడు ఎం. నాగరాజు వర్మ బుధవారం తెలిపారు. ఆంధ్రాతో పాటు, ఒడిశాలోని కరాటే క్రీడాకారులు పాల్గొనవచ్చని అన్నారు.

Leave a Reply