రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
టెక్కలి : శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో రోడ్డు ప్రమాదాలు నివారణ అందరి బాధ్యతగా తీసుకోవాలని టెక్కలి ఎస్సై రామకృష్ణ వాహనదారులకు అవగాహన కలిగించారు. మంగళవారం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేపట్టి ఆయన రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.
జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. జాతీయ రహదారిపై టెక్కలి నుంచి కోటబొమ్మాలి వరకు డివైడర్లు పై అక్రమంగా ఏర్పాటు చేసిన రహదారులను మూసివేశారు.