దేశంలో మొదలైన పెళ్లిళ్ల సీజన్… 32 లక్షల వివాహాలు
ఢిల్లీ : దేశంలో పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. ఈ నెల 4వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దాదాపు 32 లక్షల వివాహాలు జరుగనున్నాయి. ఈ పెళ్లిళ్ళ ద్వారా మొత్తంగా రూ.3.75 లక్షల వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపింది. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వివాహాల సీజన్లో 32 లక్షల వరకు వివాహాలు జరుగుతాయని తెలిపింది. ఈ సందర్భంగా రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆ సంస్థ పరిశోధనా విభాగం నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా తేల్చింది.
ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా 35 నగరాల్లో 4302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఈ వివాహాలను సేకరించింది. ఈ సీజన్లో ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరుగుతాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. ఈ వివాహాల ద్వారా రూ.75 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
కాగా, గత యేడాది ఇదే సీజన్లో దేశంలో 25 లక్షల వివాహాలు జరిగాయని, వాటి ద్వారా రూ.3 లక్షల కోట్ల మేరకు వ్యాపారం జరిగిందని వివరించారు. ఈ సీజన్లో మొత్తంగా రూ.3.75 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందజని ఈ సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ జనవరి 14వ తేదీ నుంచి జూలై వరకు మళ్ళీ పెళ్ళిళ్ల సీజన్ కొనసాగుతుందని ఖండేల్వాల్ పేర్కొన్నారు.