ఆంధ్రప్రదేశ్

ఆ ఇంటిలో ఏం జరిగింది ? మహిళ మృతదేహం

విశాఖపట్నం : విశాఖపట్నంలోని మధురవాడ పరిధిలోని ఒక కాలనీలో… ఉదయం నుంచి ఆ ప్రాంతంలో ఒకటే దుర్వాసన…స్థానికులు అందరిలో ఏదో అనుమానం… ఎక్కడ నుంచి వస్తుందో అర్థం కాక అవస్థలు పడుతున్నారు. ఆ ప్రాంతం నుంచి ముక్కులు మూసుకుని నడుస్తున్నారు. మొత్తానికి అక్కడ కొన్నాళ్లుగా ఖాళీగా ఉన్న అద్దె ఇంటిలోంచి వస్తుందని గుర్తించారు.

ఆ ఓనర్ని పిలిపించి చెప్పగా, అతను తాళం తీసి ఆ గదిలోకి వెళ్లి చూశాడు. ఒక నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎవరూ గమనించలేదు.అయితే అంతకు ముందు ఆ ఇంటిలో అద్దెకి ఉన్నాయనపై అనుమానం వచ్చి అతనికి ఫోన్ చేశారు.

అతను వెంటనే అయ్యయ్యో నేను కాదని మొత్తుకుని, తన భార్య ఫొటోని వారికి పంపించాడు. అయితే మరి ఆ మృతదేహం ఎవరిది? ఎవరు ఆ ఇంటిలోకి వచ్చి ఆమెను హత్య చేసి ఉంటారు? ఎందుకు చేసి ఉంటారనేదానిపై స్పష్టత లేదు.

ఆ ఇంటి యజమాని వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో నార్త్ జోన్ సబ్ డివిజన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఇంటి ఓవర్ మాత్రం పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో దీనిపై మరింత లోతుగా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply