ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ రేపటి పర్యటన షెడ్యూల్ ఇదే!

న్యూస్ వన్ టీవీ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది. రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. అలాగే తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు మిగుల పనుల నిర్మాణాలకు సంభందించిన శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌ నెంబర్‌ 4లో గల వేదిక వద్దకు చేరుకోని ‘వైజాగ్‌ ఐటీ టెక్‌ పార్క్‌’ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్‌ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. అనంతరం సా. 4 గంటలకు రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి చేరుకొని.. ఎంపీ కుమారుడు, దంపతులను ఆశీర్వదించనున్నారు.

Leave a Reply