350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..
న్యూస్ వన్ టీవీ, అయోధ్య :- అయోధ్యకు పంపేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం సిద్ధమైంది. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం రోజు భక్తులకు ఈ లడ్డూలు పంపిణీ చేస్తారు. టీటీడీ 25 గ్రాముల బరువు గల లక్ష చిన్న లడ్డూలను తయారు చేసింది. అయోధ్య భక్తులకు శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేసింది.
గురువారం తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో రెండు చిన్న లడ్డూలను ప్యాకింగ్ చేశారు. మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. ఈ లడ్డూలను అయోధ్యకు పంపనున్నారు.