ఏప్రిల్ 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేయాలి: సుప్రీం
ఢిల్లీ : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏప్రిల్ 30వ తేదిలోగా విచారణ పూర్తిచేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున కాలపరిమితిని విధిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రస్తుతం వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్పీ రాంసింగ్ ను తొలగించింది. ఆయన స్థానంలో అదనంగా మరో సిట్ ను ఏర్పాటు చేసింది. దీంతో ఇక నుంచి డీఐజీ కేఆర్ చౌరాస్య పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగనుంది. కేసు విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని భార్య తులసమ్మ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల్లోగా విచారణ మొదలుకాకపోతే ఈ కేసులో(Viveka Murder Case) ఏ5 నిందితుడు బెయిల్ కోసం దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.